ఏఐ సాధనాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఏఐ సాధనాలపై అవగాహన

Sep 7 2026 12:09 AM | Updated on Sep 7 2026 12:09 AM

నెల్లూరురూరల్‌: జిల్లా గ్రామీణ విలేకరులకు ఆదివారం కలెక్టరేట్‌లోని తిక్కన సమావేశ మందిరంలో సీఆర్‌ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఏఐ ట్రైనర్‌ విజయ్‌కుమార్‌ ‘కృత్రిమ మేధ’పై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వార్తా కథనాలకు అవసరమైన సమాచారం, గణాంకాలను ఏఐ ద్వారా సేకరించవచ్చన్నారు. సీనియర్‌ పాత్రికేయుడు, ఐజేయూ సెక్రటరీ జనరల్‌ డి.సోమసుందర్‌ గ్రామీణ వార్తా కథనాలు అనే అంశంపై ప్రసంగించారు. 54 శాఖలకు చెందిన 80 పథకాలు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటి అమలు తీరుపై జర్నలిస్టులు దృష్టి సారించాలని సూచించారు. వ్యక్తులను కాకుండా సమస్యలను లక్ష్యంగా చేసుకుని వార్తలు రాయాలన్నారు. వాసిరెడ్డి వాసంతి జర్నలిజంలో నైతిక నిష్ట అనే అంశంపై ప్రసంగించారు. సీఆర్‌ మీడియా అకాడమీ చైర్మన్‌ ఆలపాటి సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆయా రంగాల్లో నిష్ణాతులైన సీనియర్‌ జర్నలిస్టులు, ఫ్యాకల్టీ సభ్యులతో తరగతులు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో నెల్లూరు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement