నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

Sep 7 2026 12:09 AM | Updated on Sep 7 2026 12:09 AM

నెల్లూరు(బృందావనం): బాలాజీనగర్‌లోని గీతామయి వృద్ధాశ్రమంలో జగదీష్‌నగర్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేశారు. అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాచపాళెం రఘు, కార్యదర్శిగా వేనాటి నవీన్‌రెడ్డి, కోశాధికారిగా దోనిపర్తి గిరిప్రసాద్‌, కార్యనిర్వాహక కార్యదర్శిగా దుర్గంపాటి పద్మజ, జాలీ వాకర్‌గా కె.మురళీమోహన్‌రాజు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు శింగంశెట్టి మురళీమోహన్‌రావు, గౌరవ సలహాదారులు వీరిశెట్టి హజరత్‌బాబు, తమ్మినేని పాండు, పప్పు నారాయణ, లీగల్‌ అడ్వైజర్‌ గుండు సుబ్రహ్మణ్యం, వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ డిస్ట్రిక్ట్‌ 203 గవర్నర్‌ నలుబోలు బలరామయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌కు సన్మానం

నెల్లూరు(అర్బన్‌): ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ ఆలపాటి సురేష్‌కుమార్‌ను పీఎంపీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సన్మానించారు. అసోసియేషన్‌కు చెందిన 60 సంవత్సరాల సావనీర్‌ను అందజేశారు. రాష్ట్ర కోశాధికారి శాఖవరపు వేణుగోపాల్‌ మాట్లాడుతూ ప్రజారోగ్యానికి సంబంధించిన పల్స్‌ పోలియో, టీబీ నివారణ చైతన్య కార్యక్రమాలు, ఉచిత వైద్యశిబిరాలు చేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో పీఎంపీ గౌరవాధ్యక్షుడు అనుమల జయప్రకాష్‌, గోరంట్ల శేషయ్య, ప్రసాద్‌, మాలిని, శ్రీధర్‌రావు, శంకర్రావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎరుకల సేవా సంఘం అధ్యక్షుడికి పురస్కారం

నెల్లూరురూరల్‌: సామాజిక సేవా రంగంలో విశేష సేవలందిస్తున్న ఏపీ ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్‌, జిల్లా అధ్యక్షుడు నల్లగొండ్ల శివకు, దాసరి పోలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉత్తమ సేవా పురస్కారం సందర్భంగా ఆదివారం అభినందన సభ నిర్వహించారు. దర్గామిట్ట ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్‌ దేవరకొండ సుజాత అశోక్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శివ మాట్లాడుతూ ఎరుకల సమాజానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలందేలా, యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఎరుకల జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాలపర్తి శ్రీనివాసరావు, దాసరి కోటయ్య, నల్లగొండ్ల వెంకయ్య, దాసరి రామస్వామి, కట్ట రమణయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చేయూత

నెల్లూరు(బృందావనం): విద్యా ప్రోత్సాహక, సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ సంఘమిత్ర అధ్యక్షురాలు షేక్‌ పర్వీన్‌ ఆధ్వర్యంలో మూలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు ఆదివారం యాంప్లిఫైర్‌ను అందజేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల కార్యక్రమాలు, సమావేశాలు, విద్యార్థుల కార్యక్రమాలకు ఉపయోగపడేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రవాస భారతీయుడు రవికిరణ్‌ సౌజన్యంతో రూ.25 వేల విలువైన యాంప్లిఫైర్‌ను ప్రధానోపాధ్యాయురాలు రమాదేవికి అందజేశారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ సంఘమిత్ర కార్యదర్శి సాయిలక్ష్మి, కోశాధికారి అనూరాధ, సంధ్య పాల్గొన్నారు.

తలసేమియా రోగుల కోసం రక్తదానం

నెల్లూరు(అర్బన్‌): తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం పోతిరెడ్డిపాళెం యాదవ యువత ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని మద్రాస్‌ బస్టాండ్‌ వద్ద ఉన్న రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌లో పలువురు యువకులు రక్తదానం చేశారు. తమ మిత్రుడు శివకృష్ణ జ్ఞాపకార్ధం ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బ్లడ్‌బ్యాంక్‌ అడహక్‌ కమిటీ సభ్యుడు చమర్తి జనార్దన్‌రాజు మాట్లాడుతూ తలసేమియా చిన్నారులకు తరచూ రక్త మార్పిడి జరగాల్సి ఉందన్నారు. అలాంటి వారి కోసం రక్తదానం చేసిన యువతను అభినందించారు. కార్యక్రమంలో అశోక్‌, శేషసాయి, ప్రణయ్‌, మహిత్‌, మస్తానయ్య, శ్రీకాంత్‌, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement