నెల్లూరురూరల్: సమాజ నిర్మాణంలో, విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఎస్.యానాదిరెడ్డి, జి.విజితను ఆదివారం నెల్లూరులోని రాంజీ నగర్‌లో ఉన్న కార్యాలయంలో సత్కరించి అభినందించారు. ఏపీ వైఎస్సార్‌టీఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధన చేయడంతోపాటు వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో టీచర్లు కీలకంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు కె.శివశంకర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బి.రఘురామిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.వాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ప్రసాద్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్.శ్రీలత, వేణుగోపాల్‌రావు, మంజుల, మాలిని, శోభన్‌బాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


