నేరడిగొండ: రహదారి ప్రమాదాలు జరుగుతు న్నా సంబంధిత అధికారులు పట్టించుకోరా.. అంటూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. మండలంలోని కుప్టి హైవే (ఎన్‌హెచ్44)ను శు క్రవారం పరిశీలించారు. ఈ జాతీయ రహదారి కి కుప్టి వద్ద గుంతలు పడటం,రోజులు గడుస్తు న్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ని త్యం లక్షలాది వాహనాలు తిరిగే ఈ రహదారి పై గల బ్రిడ్జిపై సింగిల్‌వే చేయడంతో అనేక ప్ర మాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. సమాధానం రాకపోయినా, అధికా రులు పనులు పూర్తి చేయకపోయినా హైవే దిగ్బంధం చేస్తానని హెచ్చరించారు.


