ఆదిలాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల్లో వాసుదేవుని దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. తమ చిన్నారులను శ్రీకష్ణుడు, గోపికల వేషధారణతో తీర్చిదిద్ది తల్లిదండ్రులు మురిసిపోయారు. జిల్లా కేంద్రంలోని రాంపూర్ సమీపంలో గల ఇస్కాన్ ఆలయంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శ్రీ సత్యభామారుక్మిణి సమేత గోపాలకృష్ణ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో మఠాధిపతి యోగానంద సరస్వతిస్వామి తదితరులు పాల్గొన్నారు.


