రాజకీయాల్లో ఎంతో మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వరకు ఎదిగారు. విజయవంతంగా పనిచేస్తున్నారు. నా గురువు సత్తయ్య రిజర్వేషన్‌తో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని టీచర్ ఉద్యోగం సాధించాను. తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టాను. విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను ఎల్లప్పుడు స్మరించుకుంటాను.
– గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ
కపటం, క ల్మశం లేకుండా..
ఉపాధ్యాయులు కపటం, కల్మశం, స్వార్థం లేకుండా విద్యాబుద్ధులు నేర్పిస్తారు. వారు చెప్పిన పాఠాలతో ఈ స్థాయికి ఎదిగాను. అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పది. గురువులు సమాజ మార్గదర్శకులుగా నిలుస్తారు. నాకు ఇచ్చోడలో టీచర్ నారాయణ రెడ్డి బోధన చేశారు. చదువులో నిత్యం ప్రోత్సహించేవారు. ఇప్పటికీ ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటాను.
– అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
విలువలతో కూడిన విద్య
నేర్పించారు..
నా విద్యాభ్యాసం ఆదిలాబాద్‌లోనే. ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. ఇంటర్, డిగ్రీ గవర్నమెంట్ కళాశాలల్లో పూర్తి చేశాను. మా గురువులు విలువలతో కూడిన విద్యను బోధించారు. తప్పు చేస్తే దండించేవారు. వారి మార్గదర్శకంలో ఈ స్థాయికి ఎదిగాను. ప్రస్తుతం సెల్‌ఫోన్లు, సోషల్ మీడియాతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. నేను సూపరింటెండెంట్ అయ్యేవరకు కూడా సెల్‌ఫోన్ ఉపయోగించలేదు. – డి.మాధవి, డీఈవో


