మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద టాస్క్‌ఫోర్స్ ఏసీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు వాహనాలను సీజ్ చేశారు. ఆ వాహనాల్లో 13 ఆవులు, 17 దూడలు ఉండడంతో వాహనాలు నడుపుతున్న నక్క రాజ్‌కుమార్, షేక్ అహ్మద్, సుకే కుమార్, సహాయకులు షేక్ షఫి, షేక్ షాహీద్, ఓరగంటి రాజ్‌కుమార్, తాండ్ర శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ పశువులను ఆసిఫాబాద్ జిల్లా కౌటాల నుంచి జగి త్యాల జిల్లా రాజారాంపల్లె మార్కెట్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.


