ఆదిలాబాద్: జి ల్లాకి చెందిన యు వ క్రీడాకారుడు అట్టం జశ్వంత్ అథ్లెటిక్స్‌లో ప్రతి భ చాటుతూ జా తీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పుదుచ్చేరిలో నిర్వహించనున్న 37వ నేషనల్ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల హన్మకొండ వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ –20 బాలుర రేస్‌వాక్ విభాగంలో అట్టం జశ్వంత్ బంగారు పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డిబోజా రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రాజేశ్, శిక్షకులు వీజీఎస్ రాకేశ్, జ్యోతి స్వరణ్ క్రీడాకారుడిని అభినందించారు.


