ఆదిలాబాద్: ఇంద్రవెల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మేకల సౌమ్యకు ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు –2026 లభించింది. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుల్లో ఆమెను పురస్కారానికి ఎంపిక చేశారు. విద్యార్థినులకు క్రీడాశిక్షణ అందించడంతో పాటు క్రీడారంగంలో ఆమె చేస్తున్న కృషి, ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. ఉత్తమ పీడీగా ఎంపిక కావడంపై పలువురు క్రీడా సంఘాల బాధ్యులు, క్రీడాకారులు అభినందనలు తెలిపారు.


