బాసర: తెలుగు భాష గొప్పతనాన్ని చేనేత కళతో మేళవిస్తూ సిరిసిల్లకు చెందిన ఓ కళాకారుడు అద్భుతమైన పట్టుచీర నేశాడు. తెలుగు భాషకు మూలమైన 56 అక్షరాలను పట్టుచీరపై అందంగా పొందుపరిచాడు. శుక్రవారం మేళతాళాల మధ్య పద్మశాలీ సంఘం సభ్యులు ఈ చీరను ఆలయానికి తీసుకొచ్చి ఈవో అంజనాదేవి, ఆలయ స్థానాచా ర్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీ పూజారి, వేద పండితుల సమక్షంలో అమ్మవారికి సమర్పించారు.
35ఏళ్ల అనుభవం..
నల్ల జగదీష్ గత 35 ఏళ్లుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్నారు. తన అనుభవంతో ఎన్నో వినూత్న వస్త్రాలు తయారు చేసిన ఆయన తెలుగు భాషకు సంబంధించిన 56 అక్షరాలను చేనేత చీరపై నేసి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి నల్ల పరంధాములు కూడా చేనేత రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని, ఆయన ఆశీర్వాదంతోనే తాను ఈ కళాఖండాన్ని రూపొందించినట్లు జగదీష్ తెలిపారు. తన తండ్రి కలలో సూచించినట్లుగా ఈ చీరను అమ్మవారికి సమర్పించాలనే సంకల్పంతో కుల, సత్రం ప్రతినిధుల సహకారంతో బాసర అమ్మవారికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో సత్రం అధ్యక్షుడు రాపోల్ సుధాకర్, కార్యనిర్వహక అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, ప్రధా న కార్యదర్శులు రమణ విశ్వం, జెంటిల్ శ్యామ్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేశ్‌గౌడ్, కొక్కుల గంగాధర్, మోరే సాయిలు, ఎలగందుల శ్రీనివాస్, ఓని స్వామి, రువ్విపోశెట్టి, మేకల అశోక్, అంకం రమేశ్ తదితర గ్రామ పద్మశాలీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
15 రోజులు నిష్ఠతో..
సిరిసిల్ల వాస్తవ్యుడు నల్ల పరంధాములు కుమారుడు నల్ల జగదీశ్ నేత తన తండ్రి ఆశయాలు, ఆశీర్వాదంతో ఈ వినూత్న చీరను రూపొందించా రు. పొడవు ఆరు మీటర్ల 30 సెంటీమీటర్లు, వెడ ల్పు ఒక మీటరు 25 సెంటీమీటర్లు, 650 గ్రాముల బరువున్న ఈ చీరను చేనేత మగ్గంపై 15 రోజులపాటు నిష్ఠతో నేశారు. చీర మొత్తం తెలుగు అక్షరమాలతో కళాత్మకంగా తీర్చిదిద్దడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


