దిలావర్‌పూర్: మడలంలోని కాల్వ గ్రామ సమీప అటవీప్రాంతంలో పంటచేలకు వెళ్లే విత్యుత్ తీగలు తెగి పడడంతో మేత కోసం వెళ్లిన రెండు మేకలు, నాలుగు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గురువారం కురిసిన వర్షం, గాలుల కారణంగా అడవిలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. శుక్రవారం ఉదయం కాల్వ గ్రామానికి చెందిన కుర్మె దేవన్న, నడిపి సాయన్న మేలకలు, గొర్రెలను మేతకోసం తీసుకెళ్లారు. విద్యుత్ తీగలకు తాగిన రెండు మేకలు, నాలుగు గొర్రెలు మృతిచెందాయి. వెంటనే కాపరులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మృతి చెందిన మేకలు, గొర్రెల విలువ రూ.లక్ష పైనే ఉంటుందని బాధితులు తెలిపారు. తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


