లక్ష్యంపైనే దృష్టి.. | - | Sakshi
Sakshi News home page

లక్ష్యంపైనే దృష్టి..

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని మాత్రం వదలకుండా క్రీడల్లో రాణిస్తోంది దివిటి అరుణ. కేఆర్‌కే కాలనీకి చెందిన అరుణ తల్లిదండ్రులు రాజు, సరోజల ప్రోత్సాహంతో అథ్లెటిక్స్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి ధోబీ వృత్తితో పాటు ఇనుప సామగ్రి దుకాణం నిర్వహిస్తుండగా, తల్లి కూడా అదే వృత్తిలో కొనసాగుతున్నారు. వారి ప్రోత్సాహంతో అరుణ క్రీడల్లో ముందుకు సాగుతున్నారు. హ్యామర్‌త్రో, డిస్కస్‌త్రో విభాగాల్లో ప్రతిభ కనబరుస్తున్న అరుణ ఇప్పటివరకు మొత్తం పది పతకాలు సాధించారు. షూటింగ్‌బాల్‌లోనూ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. క్రీడలపై ఉన్న ఆసక్తితో భవిష్యత్‌లో పీడీగా సేవలందించాలన్నది తన లక్ష్యం అని చెబుతున్నారు. కోచ్‌లు వీజీఎస్‌ రాకేశ్‌, వీజీఎస్‌ జోల శిక్షణతోనే ఇన్ని విజయాలు సాధ్యం అయ్యాయని చెబుతున్నారు.

అరుణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement