ఆదిలాబాద్‌టౌన్: దివ్యాంగులకు ఒకేచోట సమగ్ర సేవలు అందించేందుకు రిమ్స్‌లో సౌండ్ ప్రూఫ్ గది ప్రారంభించినట్లు కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం రిమ్స్ ఆసుపత్రిలో రూ.6లక్షల వ్యయంతో నిర్మించిన ధ్వని నిరోధక (సౌండ్ ప్రూఫ్) గదిని ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఒకేచోట దివ్యాంగులకు వైద్య సేవలతో పాటు యూడీఐడీ అసెస్‌మెంట్, సదరం సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేక గది ఏర్పాటు చేశామన్నారు. పరీక్షించిన వెంటనే పోస్టల్ అడ్రస్ ద్వారా సర్టిఫికెట్లను నేరుగా ఇంటికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఆర్డీవో రవీందర్, ఏపీవో పెన్షన్ శేషారావు, రిమ్స్ వైద్యులు, దివ్యాంగులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సౌర విద్యుత్ సర్వేను వేగవంతం చేయాలి
కై లాస్‌నగర్: సౌర విద్యుత్ సర్వే, మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో నీ ఛాంబర్‌లో పీఎం జన్‌మన్ పథకం కింద ఆవా సాల్లో చేపట్టిన సౌర విద్యుత్ సర్వే, ఆఫ్‌గ్రిడ్ సౌర విద్యుత్ వివరాలు, ఎస్సీ కార్పొరేషన్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు ఆవా సాల్లోని 55 గృహాల్లో 300 మెగావాట్ల సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయగా, అందులో 39 సక్రమంగా పనిచేస్తున్నాయన్నారు. కొత్తగా 12 ఆవాసాలకు సంబంధించిన ఆఫ్‌గ్రిడ్ సోలార్ సర్వే వివరాలను వారం రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు. ధర్మాయిపేట, పోతుగూడ, లక్కారం, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు పూర్తయిన ఇళ్లు, పూర్తి కావాల్సిన ఇళ్లు, ఆర్సీ వివరాలపై స మీక్షించి, పెండింగ్ పనులను వేగవంతం చేసి అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుభాష్, రెడ్కో డీఎం శ్రీనివాస్, డీఈ లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితా ప్రక్రియ పారదర్శకంగా
పూర్తి చేయాలి
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతీ ఓటరుకు పూర్తి స్పష్టతనిచ్చి, నిబంధనల ప్రకారం విచారణను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. శుక్రవారం ఆదిలా బాద్ పట్టణంలోని తిరుపల్లిలోని 203వ పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ 2002 నాటికి లేదా అంతకంటే ముందు ఉన్న రికార్డులు, ప్రభుత్వ పత్రాలు, విద్యాసంస్థల ధ్రువపత్రాలు లేదా బ్యాంక్ పాస్‌బుక్‌లను పరిశీలించి అర్హతలను నిర్ధారిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా నిబద్ధతతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో జగదీశ్వర్ రావు, తహసీల్దార్ శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ రేవతి, సూపర్ వైజర్, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.


