ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో శుక్రవారం మెస్రం వంశీ యులు నొవోంగ్ (నవధాన్యాల) పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా మెస్రం వంశీయులు కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకుని ఖరీఫ్ సీజన్‌లో చేతికొచ్చిన పెసర, మినుము, మొక్కజొన్న తదితర చిరుధాన్యాలతో నైవేద్యం తయారు చేసి నాగోబాకు సమర్పించారు. ఏటా ఖరీఫ్‌లో సాగు చేసిన పంటల్లో ముందుగా చేతికి వచ్చే పంటలను కుల దేవతకు సమర్పించి మొక్కులు తీర్చుకుంటామని నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు. పెద్దలు హనుమంత్‌రావ్, మెస్రం కోసేరావ్, బాదిరావ్, శేకు, నాగ్‌నాథ్, దాదేరావ్, తిరుపతి తదితరులు ఉన్నారు.


