పట్టుదలతో సాధన చేస్తూ రేస్‌వాకింగ్‌లో జిల్లా క్రీడాకారుడు జశ్వంత్ దూసుకెళ్తున్నాడు. బజార్‌హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన అట్టం జశ్వంత్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రైతు కుటుంబానికి చెందిన జశ్వంత్ తండ్రి రమేశ్, తల్లి విజయల ప్రోత్సాహంతో క్రీడల్లో రాణిస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటుకున్నాడు. బిహార్‌లోని పాట్నాలో జరిగిన జాతీయస్థాయి చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి సత్తా చాటాడు. ఇప్పటివరకు నాలుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న జశ్వంత్.. రెండు బంగారు, రెండు రజత పతకాలు సాధించాడు. రేస్‌వాకింగ్‌లో మంచి టైమింగ్, పట్టుదలతో ముందుకు సాగుతున్న యువ కెరటం భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలనే లక్ష్యంతో కఠోర సాధన చేస్తున్నట్లు తెలిపాడు.
జశ్వంత్


