రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు పట్టణ ఎస్సై శ్రీధర్ తెలిపారు. కాసిపేట మండలం ధర్మారావుపేటకు చెందిన నూకల సంతోష్‌కుమార్ (22) బైక్‌పై శ్రీరాంపూర్ నుంచి క్యాతనపల్లి వైపు రాంగ్ రూట్‌లో వెళ్తూ ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొన్నాడు. తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఘటనలో ద్విచక్ర వాహ నం, బొలెరోకు మంటలు అంటుకోవడంతో ఫైరింజన్ సహాయంతో అదుపు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


