బాధితులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు అండగా ఉంటాం

Feb 24 2026 7:12 AM | Updated on Feb 24 2026 7:12 AM

బాధితులకు అండగా ఉంటాం

బాధితులకు అండగా ఉంటాం

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: బాధితులకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం అండగా నిలుస్తుందని, వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ డే నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీకి తమ సమస్యలను విన్నవించారు. జిల్లా వ్యాప్తంగా 38 ఫిర్యాదులను రాగా.. స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా నేరుగా వాట్సాప్‌ నంబర్‌ 8712659973కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement