పత్తి రైతుల ఆందోళన
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. సీసీఐ ఎలాంటి నిబంధనలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో రైతులు పత్తిని యార్డుకు ఉదయాన్నే తీసుకొచ్చారు. కౌడి, తేమ ఉన్న పంటను కొనుగోలు చేయమని సీసీఐ అధికారులు స్పష్టం చేయడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు కొనుగోళ్లు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకురాలు సుహాసినిరెడ్డి అక్కడికి చేరుకొని రైతులకు మద్దతు తెలిపారు. నిబంధనల పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని అధికారులకు సూచించారు. సీసీఐ అధికారులు ససేమిరా అనడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మళ్లీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. నాణ్యత లేని పత్తిని తొలగించాలని రైతులకు సూచించారు. తేమ ఉన్నవాటిని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించారు.
పత్తి రైతుల ఆందోళన


