జాతీయస్థాయిలో సత్తా చాటాలి
ఆదిలాబాద్‌టౌన్: జాతీయస్థాయిలోనూ సత్తా చాటి జిల్లా కీర్తిప్రతిష్టలు పెంచాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీస్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్తా చాటిన జిల్లాకు చెందిన పలువురిని సోమవారం ఆయన సన్మానించారు. బ్యాడ్మింటన్ సింగిల్‌లో డీఎస్పీ ఇంద్రవర్ధన్ రజత పతకం సాధించగా, మహిళా కానిస్టేబుళ్లు పూజ 800, 400 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణపతకాలను, యోగాలో రూప స్వర్ణ, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. బాడీబిల్డింగ్ 70 కిలోల కేటగిరీలో కానిస్టేబుల్ రూప్‌సింగ్ కాంస్య పతకం సాధించాడు. కార్యక్రమంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్ వెంకటి, సీసీ కొండ రాజు, కానిస్టేబుళ్లు రూప, రోహిని, మీర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


