అకాల వర్షం
ఉట్నూర్‌లో కురుస్తున్న వర్షం
గుబిడిలో కిందపడ్డ విద్యుత్ స్తంభం
అంతర్గాం శివారులో నేలవాలిన గోధుమ పంట
జిల్లాలో అకాల వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆకాశం మేఘవృతమై వాతావరణం పూర్తిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం అర్ధరాత్రి, సోమవారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు బేల, ఉట్నూర్, ఇంద్రవెల్లి, సిరికొండ, గుడిహత్నూర్, తాంసి, గాదిగూడ, సిరికొండ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం నమోదైంది. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల భారీ వృక్షాలు రోడ్లపై విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అప్రమత్తమైన పంచాయతీ, విద్యుత్ సిబ్బంది చెట్లను తొలగించారు. కరెంట్ సరఫరా పునరుద్ధరించారు. మరోవైపు చేతికంద వచ్చిన జొన్న, మొక్కజొన్న పంటలు పలు చోట్ల నేలకొరిగాయి. నూర్పిడి చేసేందుకు చేలల్లో సిద్ధంగా ఉంచిన శనగ పంట తడిసిపోయింది. బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. మరో రెండు రోజుల పాటు అకాల వర్షాలు కొనసాగే అవకాశమున్నట్లుగా వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. – కై లాస్‌నగర్
అకాల వర్షం
అకాల వర్షం


