వినతుల వెల్లువ
కై లాస్‌నగర్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ అర్జీదారులతో కిటకిటలాడింది. మున్సిపల్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు వారాల అనంతరం నిర్వహించడంతో జిల్లా నలు మూలల నుంచి దరఖాస్తుదారులు భారీగా తరలివచ్చారు. తమ గోడు వెల్లబోసుకునేందుకు గంటల తరబడి బారులు తీరారు. కలెక్టర్ రాజర్షి షా బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలు సత్వరమే పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వారం ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూసమస్యలు, ఉపాధి హామీ పనులు వంటి వివిధ సమస్యలపై 98 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన వారి మాటల్లోనే..


