స్కౌట్స్‌,గైడ్స్‌ ఉద్యమానికి చేయూత | - | Sakshi
Sakshi News home page

స్కౌట్స్‌,గైడ్స్‌ ఉద్యమానికి చేయూత

Feb 23 2026 7:06 AM | Updated on Feb 23 2026 7:06 AM

స్కౌట్స్‌,గైడ్స్‌ ఉద్యమానికి చేయూత

స్కౌట్స్‌,గైడ్స్‌ ఉద్యమానికి చేయూత

ఆదిలాబాద్‌రూరల్‌: ఆశ్రమ పాఠశాలల్లో స్కౌట్స్‌, గైడ్స్‌ ఉద్యమానికి మరింత చేయూతనందిస్తామని గిరిజన క్రీడలు, స్కౌట్స్‌ అధికారి కె పార్థసారథి అన్నారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన స్కౌట్స్‌, గైడ్స్‌ సమాలోచన దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని 18 ఆశ్రమ పాఠశాలల్లో స్కౌట్స్‌, గైడ్స్‌ యూనిట్లు పని చేస్తున్నాయన్నారు. ముందుగా స్కౌట్స్‌, గైడ్స్‌ ఉద్యమ నిర్మాత సర్‌ బెడెన్‌ పావెల్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, చంద్రశేఖర్‌, సుగుణ, గైడ్‌ కెప్టెన్‌ రత్నబాయి, జీజాబాయి, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement