12న దేశవ్యాప్త సమ్మె | - | Sakshi
Sakshi News home page

12న దేశవ్యాప్త సమ్మె

Feb 9 2026 8:11 AM | Updated on Feb 9 2026 8:11 AM

12న దేశవ్యాప్త సమ్మె

12న దేశవ్యాప్త సమ్మె

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలనే డిమాండుతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో తామూ పాల్గొంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ (ఏపీఎంఎస్‌ఆర్‌యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.వెంకట్రావు తెలిపారు. సమ్మె పోస్టర్‌ను కలెక్టరేట్‌ వద్ద ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాత కార్మిక చట్టాలే అంతంత మాత్రంగా అమలవుతున్న పరిస్థితుల్లో కొత్త లేబర్‌ కోడ్‌ల వల్ల కార్మికులకు మరింతగా అన్యాయం జరుగుతుందని అన్నారు. తమకున్న సేల్స్‌ ప్రమోషన్‌ ఎంప్లాయీస్‌ యాక్ట్‌ను కూడా కొత్త లేబర్‌ కోడ్‌ ద్వారా రద్దు చేశారని చెప్పారు. రూ.18 వేల జీతం దాటిన వారు కార్మికులే కాదని, వారికి ఎటువంటి చట్టాలూ వర్తించవని పేర్కొన్నారని తెలిపారు. మెడికల్‌ రిప్స్‌కు నిర్దిష్ట పని పద్ధతులుండాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధానాలు అరికట్టాలని కోరుతున్నామన్నారు. యూనియన్‌ కాకినాడ బ్రాంచి కార్యదర్శి సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ, మెడికల్‌ రిప్స్‌ నిరంతరం యాజమాన్యాల వేధింపులకు గురవుతూంటారని చెప్పారు. లేబర్‌ కోడ్‌ల వల్ల వీరిపై ఒత్తిడి మరింత పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని, పని గంటలు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్‌ చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్‌, బ్రాంచి అధ్యక్షుడు ఎంఏ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement