గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి
చింతూరు: ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొఖ్వాల్ అన్నారు. స్థానిక ఐటీడీఏలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం వంటి విలువలను ప్రతి పౌరుడు జీవితంలో ఆచరించాలన్నారు. పోలవరం నిర్వాసితులకు వీలైనంత త్వరగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణం, భూ నష్ట పరిహారం, భూమికి భూమి వంటి ప్రయోజనాలు అందేలా చర్యలు చేపడతామని చెప్పారు. అదేవిధంగా గిరిజనులకు విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక వసుతుల కల్పనకు ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా చింతూరు పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏఎస్పీ బొడ్డు హేమంత్ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఏపీఓ తులసి, ఈఈ మురళి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుల్లయ్య, జీసీసీ అధికారి సుబ్రహ్మణ్యం, సీఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్ తదితరులు పాల్గొన్నారు.


