భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ

Jan 27 2026 7:36 AM | Updated on Jan 27 2026 7:36 AM

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ

భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ

గోకవరం: తంటికొండ గ్రామంలో వెంకటగిరి కొండపై వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవస్థానం చైర్మన్‌ బద్దిరెడ్డి అచ్చన్నదొర, ఈఓ ఉదయబాబు నాయుడు ఆధ్వర్యాన స్వామి వారిని పల్లకిలో ఉంచి, తూర్పు మెట్ల మీదుగా కిందకు గ్రామంలోకి తీసుకువచ్చి, వెంకటగిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో స్వామి వారి నిజ పాదముద్ర వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి విశేష పూజలు, శ్రీలక్ష్మీ నారసింహ సహిత మహా సుదర్శన హోమం, అభిషేకాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement