ఇంకా ఏడిపింఛెన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంకా ఏడిపింఛెన్‌

Jan 26 2026 4:06 AM | Updated on Jan 26 2026 4:06 AM

ఇంకా

ఇంకా ఏడిపింఛెన్‌

పేద కుటుంబానికి పెద్ద కష్టం

మంచానికే పరిమితమైన ఇద్దరు పిల్లలు

కనీసం పింఛను అందని

దయనీయ పరిస్థితులు

ప్రతి క్షణం దగ్గర ఉండాల్సిందే..

మా ఇద్దరి పిల్లలకు చిన్నతనం నుంచి వైకల్యం ఉంది. వారిని కంటి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాం. అనేక ఆసుపత్రులకు తిప్పాం. మా స్తోమతకు తగ్గ ఖర్చు చేశాం. నయం మాత్రం కాలేదు. వీరికి అన్నం పెట్టే దగ్గర నుంచి స్నానం చేయించే వరకూ అన్నీ దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. మా కుటుంబ పోషణ ఇబ్బందిగా మరింది. రోజువారీ కూలీకి వెళ్తేనే పూట గడిచేది. ప్రభుత్వం స్పందించి మా ఇద్దరి పిల్లలకు పింఛను ఇప్పించి ఆదుకోవాలి.

లక్ష్మి, మహేష్‌, చిన్నారుల తల్లిదండ్రులు

వీఆర్‌పురం: కుటుంబ పెద్ద కూలి పనులకు వెళ్తేనే రోజు గడిచేది.. అలాంటి ఇంట్లో ఇద్దరు చిన్నారులకు పెద్ద కష్టం వచ్చింది.. వారు చిన్నతనం నుంచి వినలేరు, కూర్చోలేరు, నడవలేరు.. అంగవైకల్యం మంచానికే పరిమితం చేసింది.. ఇంతటి కష్టంలోనూ ఆ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించడంలో నిర్లక్ష్యం వెంటాడుతోంది.. కనీసం పింఛను కూడా అందించకపోవడం శోచనీయం. ఆ దయనీయ గాథలోకి వెళ్తే.. వీఆర్‌ పురం మండలం రేఖపల్లి గ్రామంలో గొల్లగూడేనికి చెందిన మోడెం లక్ష్మి, మహేష్‌ భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆడపిల్ల స్పందనకు ఏడేళ్లు కాగా, అబ్బాయి సంతోష్‌కు ఐదేళ్లు. వైకల్యం రీత్యా వారు మాట్లాడలేరు. వినలేరు, కూర్చోలేరు. నడవలేరు. లేవలేని స్థితిలో ఉన్నారు. అనేక సార్లు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. మూడు నెలల కిందట బాలిక స్పందనకు సదరమ్‌ సర్టిఫికెట్‌ను పింఛనుకు అర్హతతో ఇచ్చారు. సంతోష్‌కు మాత్రం జీరో పర్సంటేజీతో అర్హత లేదని సర్టిఫికెట్‌ అందించారు. స్పందనకు అయినా పింఛను ఇస్తారని అధికారులు, నాయకుల చూట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని లక్ష్మి, మహేష్‌ దంపతులు వాపోతున్నారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేని దీనస్థితిలో ఉన్నామని అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛను కోసం తిరిగి.. తిరిగి విసిగిపోయామని అంటున్నారు. మహేష్‌ కూలి పనులకు వెళ్తేనే పూట గడిచే పరిస్థితి. ఇద్దరి పిల్లల ఆలనా పాలనా కోసం తల్లి దగ్గర ఉండాల్సి వస్తోంది. సంతోష్‌కు అప్పుడప్పుడు ఫిట్స్‌ వస్తుంటాయని, ప్రభుత్వం సాయం చేసి తమ ఇద్దరి పిల్లల ప్రాణాలు కాపాడాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. దివ్యాంగులైన పిల్లలకు సరైన వైద్య సహాయం కోసం నెలవారీ పింఛనుతో పాటు, తనకు శాశ్వత ఉపాధి కల్పిస్తే ఆసరాగా ఉంటుందని మహేష్‌ అంటున్నారు.

ఇంకా ఏడిపింఛెన్‌1
1/1

ఇంకా ఏడిపింఛెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement