యువత ఓటు హక్కు పొందాలి | - | Sakshi
Sakshi News home page

యువత ఓటు హక్కు పొందాలి

Jan 26 2026 4:06 AM | Updated on Jan 26 2026 4:06 AM

యువత ఓటు హక్కు పొందాలి

యువత ఓటు హక్కు పొందాలి

రంపచోడవరం: జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జేసీ, రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్‌ సూచించారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. జేసీ స్మరణ్‌రాజ్‌, సబ్‌ కలెక్టర్‌ శుభమ్‌ నొఖ్వల్‌లు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. యువత ఆన్‌లైన్‌లో గాని, తహసీల్దార్‌ కార్యాలయంలో గాని ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి వ్యక్తి నిర్భయంగా నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో అన్ని పోలింగ్‌ బూత్‌లకు బీఎల్వోలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్‌ సభ్యులు గొర్లె సునీత, వైస్‌ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, తహసీల్దార్‌ బాలాజీ, డీటీ జిలానీ, ఆర్‌ఐ నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement