నేటి నుంచి పురోహిత క్రికెట్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పురోహిత క్రికెట్‌ పోటీలు

Jan 26 2026 4:06 AM | Updated on Jan 26 2026 4:06 AM

నేటి

నేటి నుంచి పురోహిత క్రికెట్‌ పోటీలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): కాకినాడ డీఎస్‌ఏ గ్రౌండ్స్‌లో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్‌ పోటీలు సోమవారం నుంచి జరుగుతాయని టోర్నమెంట్‌ నిర్వాహకులు భమ్మిడిపల్లి మూర్తి, చిన్నయ్య, వై.పద్మనాభ స్వామి తెలిపారు. ఆదివారం సాయంత్రం డీఎస్‌ఏలో టోర్నమెంట్‌ ప్రారంభోత్సవాన్ని లాంఛనంగా నిర్వహించారు. సోమవారం నుంచి 30 వరకూ జరిగే పోటీల్లో 10 జట్లు తలపడనున్నాయి. హరీష్‌ స్పోర్ట్స్‌ అధినేత తలాటం హరీష్‌ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు మూర్తి తెలిపారు. కార్యక్రమంలో రాయవరపు ప్రభాకర్‌, సత్యనారాయణ మూర్తి, ఎల్లాజ్యోశ్యుల శ్రీరాము పాల్గొన్నారు.

30, 31 తేదీల్లో

‘కోకో సమ్మేళనం’

రాజమహేంద్రవరం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘కోకో సమ్మేళనం – 2026’ను ఈ నెల 30, 31వ తేదీల్లో ఏలూరులోని బాలాజీ గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి ఎన్‌.మల్లికార్జునరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మేళనంలో కోకో పంట నాణ్యత మెరుగుదల, పంట కోత అనంతర నిర్వహణ, ప్రాసెసింగ్‌ సాంకేతికత, విలువ జోడింపు, స్థిరమైన సాగు విధానాలు, అంతర్జాతీయ మార్కెట్‌ అనుసంధానం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయని ఆయన తెలిపారు. దీనికి జాతీయ స్థాయి సంస్థలు, పరిశోధనా సంస్థలు, కోకో మరియు చాక్లెట్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు, యంత్రాలు – పరికరాల తయారీదారులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, స్టార్టప్‌లు, వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొననున్నారని వివరించారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌ కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. దీనికి ఆశావహ పారిశ్రామిక వేత్తలు, అభ్యుదయ కోకో రైతులు హాజరుకావాలని మల్లికార్జునరావు విజ్ఞప్తి చేశారు.

హెడ్‌ పోస్టాఫీస్‌లో అగ్ని ప్రమాదం

కంబాలచెరువు: స్థానిక కోటిపల్లి బస్డాండ్‌ వద్ద ఉన్న హెడ్‌ పోస్టాఫీస్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు కథనం ప్రకారం.. ఆ పోస్టాఫీస్‌ వెనుక భాగంలో పాత సామగ్రిని నిల్వ చేశారు. నిల్వ చేసిన రూమ్‌లో షార్ట్‌ షర్క్యూట్‌ కారణంతో మంటలు వ్యాపించాయి. కార్యాలయం లోపల నుంచి పొగలు రావడం చూసిన స్థానికులు ఈ విషయాన్ని పక్కనే ఉన్న ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోస్టాఫీస్‌కు ఎదురుగానే ఫైర్‌ ఆఫీస్‌ ఉండడంతో సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని శ్రీనివాసరావు తెలిపారు.

నేటి నుంచి  పురోహిత క్రికెట్‌ పోటీలు 1
1/1

నేటి నుంచి పురోహిత క్రికెట్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement