
అవగాహనతోనే టీబీ నియంత్రణ
సాత్నాల: అవగాహనతోనే టీబీ నియంత్రణ సాధ్యమని జిల్లా టీబీ నియంత్రణ అధికారి సు మలత అన్నారు. భోరజ్ మండలం గిమ్మ గ్రా మంలో సోమవారం క్షయ నిర్ధారణ శిబిరం ని ర్వహించారు. సమీప గ్రామాల ప్రజలకు వ్యాఽ ది నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 135 మంది అనుమానితులను పరీక్షించినట్లు తెలిపారు. తెమడతో కూడిన దగ్గు, రెండు వారాలకు పైగా జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీబీ అలర్ట్ ఇండియా, సాతి ఎన్జీవో రాష్ట్ర ప్రతి నిధులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ జేమ్స్ రాజు, మహేందర్, తిరుపతి, సుశీల మెడికల్ ఆఫీసర్ రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.