
యూరియా.. ఆందోళన
ఇచ్చోడ పీఏసీఎస్‌లో రైతుల రద్దీ
నార్నూర్‌లో ఆందోళన చేస్తున్న రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు
ఇచ్చోడలో వేకువజాము నుంచే బారులు
ఇచ్చోడ: మండల కేంద్రంలోని యూరియా వ చ్చిందని సమాచారం అందగానే రైతులు సోమవారం ఉదయం 6 గంటల నుంచే సహకార సంఘం వద్ద బారులు తీరారు. 444 బ్యాగులు వచ్చినట్లు సీఈ వో రాథోడ్ ఈశ్వర్ తెలిపారు. అయితే ఉదయం నుంచి క్యూలో ఉన్నా కొంత మందికి యూరియా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
నార్నూర్‌లో బీఆర్‌ఎస్ నిరసన
నార్నూర్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట బీఆర్‌ఎస్ ఆందోళన చేపట్టింది. దాదాపు గంటసేపు బైఠాయించి నిరసన తెలి పా రు. జెడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, సరిపడా ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరానికి బస్తా చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. ఇందులో పీఏ సీఎస్ చైర్మన్ ఆడే సురేశ్, నాగోరావ్, రూప్‌దేవ్, చంద్రశేఖర్, కాంబ్లె ఉద్దవ్, ఫిరోజ్‌ఖాన్, సయ్యద్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ: స్థానిక పీఏసీఎస్ అనుబంధ కేంద్రానికి ఎరువుల లోడ్ వచ్చిందనే సమాచారంతో రైతులు ఉదయాన్నే మండల కేంద్రానికి చేరుకున్నారు. వేకువజామున 5 గంటల నుంచే బారులు తీరా రు. నిర్వాహకులు ఉదయం 10 గంటలకు టోకె న్లు జారీ చేశారు. అయితే ఇదివరకు యూరియా తీసుకున్న వారికి నిరాకరించడంతో గందరగోళం నెలకొంది. ఏస్సై పూజ సిబ్బందితో వచ్చి రైతులను సముదాయించారు.
జిల్లా రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. పీఏసీఎస్‌ల ఎదుట గంటల తరబడి నిరీక్షించినా చాలామందికి ఎరువు లభించని పరిస్థితి. వేకువజామునే వచ్చినా ఫలితం ఉండడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం వెంటనే స్పందించాలని నార్నూర్‌లో బీఆర్‌ఎస్ ఆందోళన చేపట్టింది.

యూరియా.. ఆందోళన

యూరియా.. ఆందోళన