
పదోన్నతులు కల్పించాలని వినతి
ఆదిలాబాద్‌టౌన్: వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న బయో కెమిస్ట్, డైటీషియన్లకు పదోన్నతులు కల్పించాలని ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నాయకులు కోరారు. సోమవారం హై దరాబాద్‌లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ నరేంద్ర కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈమేరకు డీఎంఈ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వినతి పత్రాన్ని అందజేసిన వారిలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నిజాం, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ల్యాబ్‌టెక్నీషియన్లు తదితరులున్నారు.