
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్లు, ఆశా కార్యకర్తలు, వరద బాధితులను
ఆదుకోవాలని సీపీఎం చేపట్టిన ఆందోళనలతో కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది.
కమీషన్ విడుదల చేయాలని రేషన్‌డీలర్లు..
కైలాస్‌నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేషన్ డీలర్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నాంపల్లి వేణుగోపాల్ మా ట్లాడుతూ.. నెలల తరబడి కమీషన్ విడుదల చేయకుంటే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవా లని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేని ఫెస్టోలో ప్రకటించినట్లుగా డీలర్లకు రూ.5వేల గౌర వ వేతనంతో పాటు క్వింటాల్ బియ్యంకు రూ.300 కమీషన్ చెల్లించాలన్నారు. అనంతరం అదనపు కలె క్టర్ శ్యామలాదేవిని కలిసి వినతిపత్రం అందజేశా రు. ఇందులో సంఘ బాధ్యులు వెంకటేశ్, హరీంద్ర, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనం కోసం ఆశావర్కర్లు ..
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీ యూ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ, ఆశాలకు రూ.18వేలు కనీస వేతనం చెల్లించాలని, అలా గే అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశా రు. డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ వారి వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించడంతో ఆందోళన విరమించారు. ఇందులో సంఘబాధ్యులుపాల్గొన్నారు.
పంట నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం..
భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామంలో వరద బాధితులకు పరిహారంతో పాటు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.మల్లేశ్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ధర్నాలో మాట్లాడారు. అధికారులు సర్వే క్షేత్రస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి బాధితులకు న్యాయం జరి గేలా చూడాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో నా యకులు దత్తాత్రి, మంజుల, స్వామి, ఆరిఫా తదితరులు పాల్గొన్నారు.

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్