
అర్జీల వెల్లువ
ఈ వారం ప్రజావాణికి 139 దరఖాస్తులు అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ సత్వరం పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కొందరు.. సాగుభూములకు పట్టాలివ్వాలని మరి కొందరు.. పంటలకు నష్ట పరిహారం అందించాలని ఇంకొందరు.. ఇలా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తమ గోడు వెల్లబోసుకున్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 139 అర్జీలు అందాయి. అందులో కొందరి ఆవేదన..