
నాగోబాను దర్శించుకున్న ఎస్పీ
ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబ సమేతంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని మెస్రం వంశీయులు ఘనంగా సన్మానించారు. ఇందులో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న, మెస్రం వంశీయులు వెంకట్‌రావ్, ఆనంద్‌రావ్, తదితరులున్నారు.
మహదేవ్ ఆలయ సందర్శన
ఉట్నూర్‌రూరల్: మండలంలోని సాలెవాడ గ్రా మంలో గల హరహర మహదేవ్ ఆలయాన్ని ఎస్పీ అఖిల్ మహజన్ దర్శించుకున్నారు. అ లాగే కొండపై ఉన్న శివుని విగ్రహం వద్ద ప్ర త్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట వామన్‌మహరాజ్, శ్యాంప్రసాద్, ఆలయ కమి టీ సభ్యులు పాల్గొన్నారు.