
విద్యుత్ కాంట్రాక్టర్ల నిరసన
ఆదిలాబాద్‌టౌన్: తమకు బిల్లులు వెంటనే చెల్లించాలని విద్యుత్ కాంట్రాక్టర్లు ఆదివారం ఎస్‌ఈ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ జాదవ్ మాట్లాడుతూ, నెలల తరబడి బిల్లులు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. అలాగే మూడేళ్లుగా తమను జేఏఓ వేధింపులకు గురిచేస్తున్నట్లుగా ఆరోపించారు. ఆయనను వెంటనే సబ్ డివిజన్ కార్యాలయం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందులో కాంట్రాక్టర్లు రాము, అశోక్, రవీందర్‌రెడ్డి, నర్సింగ్, హరిచరణ్, రాథోడ్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.