
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయుల సమస్యలు పరి ష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహాన్, గోపీకృష్ణ కోరారు. ఈమేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కొమురయ్యను హైదరాబాద్‌లో ఆదివా రం కలిసి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:20 సవరించేలా చూడాలన్నారు. అలాగే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, నూతన పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇందులో రాజ్‌కుమార్, దత్తాత్రి తదితరులున్నారు.