
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
నార్నూర్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి కుడ్మేత మనోహర్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఏఎన్‌సీ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు మె రుగైన వైద్యం అందించాలని, గ్రామాలకు వెళ్లి వ్యాధులపై అవగాహన కల్పించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎ ప్పటికప్పుడు ఆశ కార్యకర్తల ద్వారా తెలుసుకోవాలని పేర్కొన్నారు. విధులను నిర్లక్ష్యం చే స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీహెచ్‌సీ డీడీవో డాక్టర్ జితేందర్‌రెడ్డి, హెచ్‌ఈ తులసీ దాస్ రాథోడ్, చౌహాన్ నాందేవ్, హెల్త్ సూపర్‌వైజర్ చరణ్‌దాస్ చౌహాన్ తదితరులున్నారు.