కైలాస్‌నగర్: పంద్రాగస్టు వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం ముస్తాబైంది. పోలీసు ల కవాతు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలకు వీలుగా మైదానాన్ని చదును చేసి రంగురంగుల ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రాంతంతో పాటు ముఖ్య అతి థులు ఆసీనులయ్యే వేదికను సిద్ధం చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రభు త్వ శాఖల అధికారులు, జర్నలిస్టులు కూర్చునేందు కు వీలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్ర భుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని తె లియజేసేలా స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు గాను శాఖ ల వారీగా టెంట్లు వేశారు. వేడుకలు తిలకించేందు కు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ శాఖల ప్రగతి తీరు తెన్నులను తెలిపే శకటాలను ప్రదర్శించనున్నారు. ఉదయం 9.30గంటలకు జరిగే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఉత్తమ సే వలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాళ్లను తిలకించి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేయనున్నారు.
జిల్లాకు చేరుకున్న ముఖ్య అతిథి
పంద్రాగస్టు వేడుకల ముఖ్య అతిథి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ గురువారం జి ల్లా కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక పెన్‌గంగా గెస్ట్‌హౌస్‌కు రాగా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మ హాజన్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
‘పంద్రాగస్టు’కు అంతా సిద్ధం