
పట్టణం.. త్రివర్ణ శోభితం
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించగా ప్రధాన వీధులు త్రివర్ణ శోభితమయ్యాయి. విద్యార్థుల దేశభక్తి నినాదాలతో చౌరస్తాలు మార్మోగాయి. ర్యాలీని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విజయం అద్వితీయమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు భారతదేశం నాయకత్వం వహించేలా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పయనిస్తోందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతానికి సూచికగా ప్రతీ గ్రామంలో తిరంగా ర్యాలీ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేదవ్యాస్, దినేశ్ మటోలియా, ముకుందరా వు, మహేందర్, కృష్ణయాదవ్, మురళీధర్, ఆదిత్య ఖండేశ్కర్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణం.. త్రివర్ణ శోభితం