ముందస్తు చర్యలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ముందస్తు చర్యలు చేపట్టాలి

Aug 15 2025 7:02 AM | Updated on Aug 15 2025 7:02 AM

ముందస్తు చర్యలు చేపట్టాలి

ముందస్తు చర్యలు చేపట్టాలి

కై లాస్‌నగర్‌: భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చ ర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. గురువారం హై దరాబాద్‌ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ని ర్వహించి పలు సూచనలు చేశారు. సహాయక చర్య ల కోసం జిల్లాకు రూ.కోటి విడుదల చేసినట్లు తెలి పారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి, సెలవుపై వెళ్లిన వారిని వెనక్కి రప్పించాలని సూచించారు. కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అడిషనల్‌ కలెక్ట ర్‌ శ్యామలాదేవి, వివిధ శాఖల అధికారులున్నారు.

అత్యవసర సాయం అందించాలి

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం సిద్ధంగా ఉండేందుకు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజర్షి షా సూచించారు. వనమహోత్సవంలో భాగంగా మండలంలోని యాపల్‌గూడలోగల రెండో పోలీస్‌ బెటాలియన్‌ ఆవరణలో 600 మామి డి మధుబన్‌ మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై బెటాలియన్‌ సిబ్బందికి అవగాహ న కల్పించారు. అనంతరం బెటాలియన్‌ సిబ్బందితో కలిసి శిక్షణ పొందిన వంద మంది అత్యవసర సందర్భాల్లో ప్రజలకు సహాయం చేయడం కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన డెమో తిలకించారు. అ నంతరం రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ తదితర అంశాలపై శిక్షణ పొందిన సిబ్బందిచే డెమో కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, బెటాలియన్‌ కమాండెంట్‌ నితిక పంత్‌, ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement