
రాజకీయంలో నిబద్ధత పెరగాలి
భారత రాజ్యాంగం ఎంతో ఉన్నతమైంది. ఎన్నో ఆకాంక్షలు, అ భివృద్ధి, ప్రణాళికలు, అందరి హక్కులు, బాధ్యతలకు సమ ప్రాధాన్యతనిస్తూ రూపొందించబడింది. రా జ్యాంగం నిబంధనలకు అనుగుణంగా రాజకీ య నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నిబద్ధతతో మెలగాలి. – ఎ.స్రవంతి
ఆర్థికంగా అగ్రస్థానంలో నిలవాలి
ఆర్థికాభివృద్ధిలో దే శం వేగంగా ముందుకు సాగుతోంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఫలితంగా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. 2047 వరకు మన దేశం ఆర్థికంగా అగ్రస్థానంలో నిలవాలి. పేదరిక నిర్మూలనకు విప్లవాత్మక చర్యలు చేపట్టాలి. – వై.వైష్ణవి
దేశభక్తిని మనసులో నింపుకోవాలి
స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కొందరు సోషల్ మీడియాలో దేశభక్తిని చాటుతుంటారు. సాధారణ రోజుల్లోనూ ఇది కనిపించాలి. మన సంస్కృతి, విలువలను కాపాడుకుంటూ గొప్పగా ప్రవర్తించాలి. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశ ప్రగతికి పాటుపడాలి. దేశభక్తిని మనసులో నింపుకోవాలి. – డీ అనుదీప్తి
సాంకేతికత వైపు సాగాలి
రోజురోజుకూ పెరిగిపోతున్న టెక్నాలజీ దేశాభి వృద్ధికి తోడ్పడాలి. అవసరమైన టెక్నాలజీని వి నియోగించుకుని నిరుద్యోగ యువత ఆర్థిక స్వావలంభన దిశగా ముందుకుసాగాలి. విద్యతోనే అన్నిరంగాల్లో ముందుకు సాగవచ్చు. అందరికీ ఉన్నతవిద్య అందించేంలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – కే సింధు

రాజకీయంలో నిబద్ధత పెరగాలి

రాజకీయంలో నిబద్ధత పెరగాలి

రాజకీయంలో నిబద్ధత పెరగాలి

రాజకీయంలో నిబద్ధత పెరగాలి