
అభివృద్ధి చెందిన దేశంగా మారాలి
మన దేశం దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతోంది. అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో శ్రమించాలి. ప్రభుత్వాలూ ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయాలి. ప్రణాళికలు పకడ్బందీగా అమలు చేస్తే ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా తప్పనిసరిగా మారుతుంది.
– జీ శ్రీజ
శక్తివంతంగా తయారు కావాలి
ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలున్నా మన ఐక్యతే దేశానికి పెద్దబలం. భిన్నాభిప్రాయాలున్నా సోదరభావంతో మెలుగుతున్నాం. ఏ దేశం బలప్రయోగం, బలవంతపు ఒత్తిడులు ఇండియాపై పడకుండా ప్రభుత్వం పటిష్ట విదేశాంగ విధానం అమలు చేయాలి. ప్రపంచ యవనికపై దేశం శక్తివంతంగా ఎదగాలి. – కూర ఐశ్వర్య
రవాణా సౌకర్యం మెరుగుపర్చాలి
రవాణా రంగం అభివృద్ధితోనే దేశాభివృద్ధి ముడిపడి ఉంటుంది. రవాణా రంగం ఎంతగా ప్రగతి సాధిస్తే అంత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు, జల, వాయు మార్గాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలి. వీటితో ఎగుమతులు, దిగుమతులు పెరిగి విదేశీ ద్రవ్యం పోగుపడుతుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలి. – పీ చైత్ర

అభివృద్ధి చెందిన దేశంగా మారాలి

అభివృద్ధి చెందిన దేశంగా మారాలి

అభివృద్ధి చెందిన దేశంగా మారాలి