
క్రమశిక్షణతో ట్రైనింగ్ పొందాలి
ఆదిలాబాద్‌రూరల్: ఎన్‌సీసీ కెడెట్లు దేశ సమైక్యతకు క్రమశిక్షణతో ట్రైనింగ్ పొందాలని కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ వీపీ సింగ్ సూ చించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తె లంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళా శాల (పురుషులు) ఎన్‌సీసీ యూనిట్‌ను సందర్శించారు. ఆయనకు ప్రిన్సిపల్ డాక్టర్ శివకృష్ణ, ఎన్‌సీసీ లెఫ్ట్‌నెంట్ పుట్ట లక్ష్మణ్, ఎన్‌సీసీ కె డెట్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం వీపీ సింగ్ కళాశాల యూనిట్ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తంజేశారు. సామాజిక బాధ్యత పెంచుకోవాలని కెడెట్లకు సూచించారు. ఎన్‌సీసీ కెడెట్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.