
మళ్లీ పొడిగింపేనా?
పీఏసీఎస్ పాలకవర్గాల గడువు నేటితో ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆరునెలల పాటు పొడిగించిన విషయం తెలిసిందే.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
.. నిందితుడి అరెస్ట్
ఉద్యోగాల పెరిట నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపా రు. హెడ్‌క్వార్టర్స్‌లో వివరాలు వెల్లడించారు.
గురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాత్నాల: భారీ వర్షం కారణంగా సాత్నా ల ప్రాజెక్టుకు వరద పెరిగింది. ఈ మేరకు బుధవారం ఒక గేట్ ఎత్తి నీటిని దిగువకు వదిలినట్లు జేఈ దీపక్ తెలిపారు. ప్రాజె క్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.046 టీఎంసీలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కులు ఉండగా.. అంతే మొత్తంలో అవుట్‌ఫ్లో కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్‌ను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం సందర్శించారు. నీటి మట్టాన్ని పరిశీ లించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. వారి వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, ఇతర అధి కారులు ఉన్నారు.
తాంసి: మండలంలోని మత్త డి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో బుధవారం వేకువజామున ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 757 క్యూసెక్కులు ఉండగా..1,240 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉన్నట్లు ఏఈ హరీశ్‌కుమార్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 277.5 మీటర్లు కాగా ప్రస్తుతం 277.40 మీటర్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక నీటి నిల్వ సామర్థ్యం 0.571 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.451 టీఎంసీగా ఉన్నట్లు తెలిపారు.
జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షం
గవర్నర్‌ను కలిసిన ఎంపీ నగేశ్
ఆదిలాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మను ఎంపీ గోడం నగేశ్ మంగళవారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి, పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై గవర్నర్‌తో చ ర్చించారు.అలాగే ఆదిలాబాద్ పార్లమెంట్ పరి ధిలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని కో రారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించి వర్షాకాలం ముగిసిన తర్వాత పర్యటిస్తానని మాట ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.అలాగే గిరిజన ఉద్యోగ సంఘం నాయకులు గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందించారు.
● సిరికొండ మండలంలోని చిక్‌మాన్ వాగు రాంపూర్ లోలెవెల్ వంతెనపై నుంచి పొంగి ప్రవహించింది. వాగు దాటకుండా రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించారు. జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, డీఎల్‌పీవో ఫణిందర్ పరిశీలించారు.
సిరికొండ : రాంపూర్ లోలెవెల్ వంతెనపై వరద ఉధృతి
● కరుణించిన వరుణుడు
● 20 రోజుల తర్వాత వర్షం
● ప్రాజెక్టులకు జల కళ
● అన్నదాతల్లో హర్షం
న్యూస్‌రీల్
‘సాత్నాల’ గేట్ ఓపెన్
మత్తడివాగు.. పరవళ్లు

మళ్లీ పొడిగింపేనా?

మళ్లీ పొడిగింపేనా?

మళ్లీ పొడిగింపేనా?

మళ్లీ పొడిగింపేనా?

మళ్లీ పొడిగింపేనా?

మళ్లీ పొడిగింపేనా?