
బుచ్చిబాబు టోర్నీకి వైస్‌కెప్టెన్‌గా హిమతేజ
ఆదిలాబాద్: దేశవాళి క్రికెట్‌లో సత్తా చాటుతున్న జిల్లాకు చెందిన కొడిమెల హిమతేజ ప్రతిష్టాత్మక బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ టోర్నీకి జట్టును ప్రకటించింది. రాహుల్ సింగ్ నాయకత్వం వహించనుండగా వైస్ కెప్టెన్‌గా హిమతేజ వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ చైన్నె వేదికగా ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి జిల్లా నుంచి రంజీలో మెరిసిన ఈ యువ క్రికెటర్ తాజాగా వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడంపై శిక్షకుడు జయేంద్ర పటాస్కర్ తదితరులు అభినందించారు.