
చిన్నారిపై వీధికుక్క దాడి
లక్ష్మణచాంద: మండలంలోని ధర్మారంలో బాలు ని పై వీధికుక్క దాడి చే యడంతో గాయాలయ్యా యి. గ్రామానికి చెందిన మల్లెల శ్రీకాంత్–శిరీష దంపతుల కుమారుడు కౌశిక్ మంగళవారం ఇంటిముందు ఆడుకుంటుండగా వీధికుక్క వచ్చి దాడి చేసింది. తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు బాలుడిని నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హత్యాయత్నం కేసులో
ఐదేళ్ల జైలు
ఆదిలాబాద్‌రూరల్: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే.ప్రభాకర్‌రావు బుధవారం తీర్పునిచ్చినట్లు మావల సీఐ కర్రె స్వామి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల్‌వాడకు చెందిన జాదవ్ ఆనంద్‌రావు మద్యం సేవించి ఇంటికి వచ్చి తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇదేక్రమంలో తలపై సుత్తెతో కొట్టడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దంపతుల కుమారుడు మహేష్ 18 డిసెంబర్ 2024న పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై విష్ణువర్ధన్ కేసు నమోదు చేశారు. కోర్టు డ్యూటీ అధికారి సంతోష్ 10 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెల్లడించారు.