
అశ్లీల వీడియోలు పోస్ట్ చేసిన ఇద్దరిపై కేసు
రామకృష్ణాపూర్: అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరిపై కేసు న మోదు చేసినట్లు మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మంగళవారం పో లీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లలో అశ్లీల వీడియోలు పోస్ట్ చేసినట్లు నేషనల్ సెంటర్ ఫర్ మి స్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్‌సీఎంఈసీ) సంస్థ వారు గుర్తించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్‌కు సమాచారం ఇచ్చారు. వారు ఆ కేసును తమకు అప్పగించడంతో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.