
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని అక్కడే ఉన్న అధికారులకు అందజేస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి 78 అర్జీలు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ వారం బాధితుల్లో కొందరి నివేదన..
కలెక్టర్‌కు రాఖీ కట్టిన అధికారులు
రక్షాబంధన్ పురస్కరించుకుని అదనపు కలెక్టర్ శ్యామలదేవితో పాటు పలువురు జిల్లా మహిళా అధికారులు కలెక్టర్ రాజర్షి షాకు రాఖీలు కట్టారు. అలాగే బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో కలెక్టర్‌తో పాటు ప్రజావాణికి హాజరైన అధికారులందరికీ రాఖీలు కట్టి మిఠాయిలు పంచారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన రాఖీలను అంగన్వాడీ కేంద్రం చిన్నారులు కలెక్టర్‌కు కట్టారు.
కలెక్టర్ రాజర్షి షా
ప్రజావాణికి 78 దరఖాస్తులు