
నులిపురుగుల నివారణకు కృషి
ఆదిలాబాద్‌టౌన్: నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. సోమవారం నులిపురుగుల నివారణ దినో త్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అర్బన్ కేజీ బీవీలో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 1నుంచి 19 ఏళ్లలోపు ఉన్నవారికి ఆల్బెండజోల్ మాత్రలను వైద్యశాఖ ఆధ్వర్యంలో అందించనున్నట్లు తెలిపా రు. అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీలు, కళాశాలల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారు 2లక్షల 6వేల 127 మంది ఉన్నట్లు తెలిపారు. ఏదైనా కారణాలతో మాత్రలు వేసుకోని వారికి ఈనెల 18న తప్పకుండా వేయించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. ఇందులో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, డీఐవో వైసీ శ్రీనివాస్, కేజీబీవీ ప్రత్యేక అధికారి దీప్తి, సీఆర్టీలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్‌నగర్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజ ర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తనచాంబర్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న వేడుకలకు సంబంధించి ఆయా శాఖలు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యా మలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్. రాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.