విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్య

Aug 12 2025 7:55 AM | Updated on Aug 12 2025 12:51 PM

విద్య

విద్యార్థిని ఆత్మహత్య

ఉట్నూర్‌రూరల్‌: ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో దరఖాస్తులు స్వీకరించారు. బేల మండలం నుంచి హరిత, ఇంద్రవెల్లి మండలం జాలంతండాకు చెందిన కుమ్మర రేణుక, గాదిగూడ మండలంలోని జరీ గ్రామానికి చెందిన కుడిమేత అశ్విని, ఆత్రం భగవంతురావు ఇంద్రవెల్లి మండలం మర్కాగూడకు చెందిన సంగీత తదితరులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీలు సమర్పించారు.

జైపూర్‌: అనారోగ్య సమస్యలతో, హాస్టల్‌లో ఉండలేక ఇంటికి వచ్చిన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేలాల గ్రామానికి చెందిన దామెరకుంట శ్రావణి –రవి దంపతులకు వైష్ణవి, లక్ష్మీప్రసన్న ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు లక్ష్మీప్రసన్న(13) జైపూర్‌ కేజీబీవీలో 8వ తరగతి చదువుతోంది. ఆమె కొద్ది రోజులుగా పంటినొప్పి, చెవి నొప్పితో బాధపడుతోంది. ఆమెకు చికిత్స చేయించేందుకు నెల క్రితం తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చూపించారు. అనారోగ్య సమస్యలకు తోడు చదువుపై ఆసక్తి లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం రాత్రి ఇనుపరాడ్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌ వెల్లడించారు.

‘దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి’

ఉట్నూర్‌రూరల్‌: ప్రజావాణిలో అందించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో దరఖాస్తులు స్వీకరించారు. బేల మండలం నుంచి హరిత, ఇంద్రవెల్లి మండలం జాలంతండాకు చెందిన కుమ్మర రేణుక, గాదిగూడ మండలంలోని జరీ గ్రామానికి చెందిన కుడిమేత అశ్విని, ఆత్రం భగవంతురావు ఇంద్రవెల్లి మండలం మర్కాగూడకు చెందిన సంగీత తదితరులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీలు సమర్పించారు.

పరారీలో ఉన్న వ్యక్తి అరెస్ట్‌

ఆదిలాబాద్‌రూరల్‌: 20 ఆటోల చోరీల్లో నిందితుడిగా ఉన్న జైనూర్‌కు చెందిన సయ్యద్‌ అలీ అనే వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్‌ రూరల్‌ ఎస్సై విష్ణువర్ధన్‌ తెలిపారు. ఆటో చోరీలకు సంబంధించి మొత్తం ఏడుగురు నిందితులు ఉండగా, అందులో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరిలో సయ్యద్‌ అలీ అనే నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

విద్యార్థిని ఆత్మహత్య1
1/1

విద్యార్థిని ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement